శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా
గోదావరిఖని,అర్జున్ సమాచారం: నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి,మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,డ్యూటీ మీట్ అనేది కేవలం అవార్డులు,రివార్డులు అందుకోవడానికి నిర్వహించే కార్యక్రమం కాదని, పోలీస్ సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి,రోజువారీ విధుల్లో స్వీయ సమీక్ష చేసుకునేందుకు ఇది ఉత్తమ...