4వ డివిజన్‌ లో రామగుండం మేయర్ మహంకాళి స్వామి పర్యటన – స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి.

 గోదావరిఖని,అర్జున్ సమాచారం: రామగుండం మేయర్ మహంకాళి స్వామి  స్వచ్ఛ రామగుండం భాగంగా 4వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లో స్థానిక కార్పొరేటర్ కంకల మౌనిక  డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.