ఆషాఢ బోనాల జాతరకు ప్రభుత్వం సర్వం సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు. బోనాల ఉత్సవాల నిమిత్తం 3427 దేవాలయాలకు 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలు విడుదల. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయం హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...