మంచిర్యాల,అర్జున్ సమాచారం:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియ విజయవంతం కావడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ప్రజలు సమన్వయంతో సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు సోమవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐఆర్ సర్వేపై అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విడుదల చేసిన అవగాహన పోస్టర్లలో మీ ఓటు మీ బాధ్యత అనే నినాదంతో కొత్త ఓటరు నమోదు పేరు తొలగింపు వివరాల సవరణ పోలింగ్ కేంద్రం మార్పు డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియ జూలై 24తో ముగుస్తుందని ఓటరు జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటరు నమోదు చేసుకునే అర్హులు అలాగే పేరు చిరునామా ఇంటి నంబర్ వయస్సు ఫోటో తదితర వివరాల్లో మార్పులు అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్పు ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియలను కూడా ఈ సర్వే ద్వారా పూర్తి చేసుకోవచ్చని ఎమ్మెల్యే వివరించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని అందువల్ల ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుందని అనంతరం అభ్యంతరాలు సవరణలకు ఆగస్టు నుంచి అక్టోబర్ 24 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 31న విడుదల కానుందని వెల్లడించారు ఈ సర్వే ప్రక్రియ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్న ఎమ్మెల్య రేషన్ కార్డులు పెన్షన్లు తదితర ప్రభుత్వ సేవలకు సంబంధించిన వివరాలను కూడా ప్రజలు సకాలంలో నవీకరించుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్పంచులు వార్డు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.ఎస్‌ఐఆర్ సర్వే పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా ప్రజాహిత దృక్పథంతో సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి కుటుంబం బాధ్యతాయుతంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మేయర్ దర్నీ మధుకర్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్య నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గజ్జెల హేమలత ఆయా డివిజన్ల కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
==========================