కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా

కరీంనగర్ జూలై 13,అర్జున్ సమాచారం: కరీంనగర్‌లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి, కార్మిక భవనం, ఇందిరమ్మ ఇళ్లు, 'కార్మిక బంధు' పథకం,...