చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026 లో మహిళల 4×400 రిలే పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు అభినందనలు తెలిపారు.

అర్జున్ సమాచారం: తెలంగాణ బిడ్డ ప్రవల్లిక నరిమళ్ల ఆసియా U23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి మహిళల 4x400 మీటర్ల రిలేలో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికపై రాణించిన ప్రవల్లిక యువ క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారని పేర్కొన్నారు. ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 4x400 మీటర్ల...