తెలంగాణ పోలీస్ క్రీడల్లో కాళేశ్వరం జోన్‌కు 48 పతకాలు ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం: సీపీ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 13: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా...