ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 5:40 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రజావాణిలో 20 అర్జీలు స్వీకరణ సమస్యల సత్వర పరిష్కారానికి కమిషనర్ ఆదేశాలు

కరీంనగర్, జూలై 13,అర్జున్ సమాచారం:

కరీంనగర్ నగరపాలక సంస్థ కళాభారతిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 20 అర్జీలను స్వీకరించారు. వీటిలో టౌన్ ప్లానింగ్‌కు 15, ఇంజనీరింగ్‌కు 1, రెవెన్యూకు 2, శానిటేషన్‌కు 1, బర్త్ అండ్ డెత్ విభాగానికి 1 దరఖాస్తు వచ్చింది. ఆక్రమణల తొలగింపు, అనధికార నిర్మాణాలు, పన్ను సవరణ, కొత్త ప్రాపర్టీలు, నల్లా కనెక్షన్, తాగునీటి సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మోహియోద్దిన్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
==========================