జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి అరుదైన గౌరవం దక్కింది. అతి చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని, భారతదేశ ప్రతిష్టతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లోకి ప్రవేశించి..గోల్డ్ మెడల్ సాధించి..పలువురి ప్రముఖులచే అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మూగ రాజ్ కుమార్ తనయుడు మూగ రిత్విక్ తేజాను, మరియు వరల్డ్ రికార్డ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మరో ముగ్గురి చిన్నారులను తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. కంప్యూటర్ యుగంలో విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్న అతి చిన్న వయసు పిల్లలను చూసి మంత్రి సురేఖ సంబరపడ్డారు. అదేవిధంగా చిన్నారులు మారుమూల ప్రాంతం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నలుగురి చిన్నారులకు క్యాష్ రివార్డ్ అందజేశారు. అలాగే అటు చదువులో ఇటు మార్చల్స్ రంగంలో తనదైన ముద్ర వేసేలా ప్రోత్సహిస్తున్న రిత్విక్ తేజా తండ్రి, ఏఆర్ కానిస్టేబుల్ రాజకుమార్ ను మంత్రి సురేఖ, బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ లు అభినందించారు. అనంతరం మంత్రి చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని, వారు అన్ని రంగాల్లో రాణించే విధంగా దృష్టి సారించాలని, నేటి విద్యార్థుల భవిష్యత్తే..రేపటి తెలంగాణ అభివృద్ధికి పునాదులు కావాలని, ఆ విధంగా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.
==============================