రాజాపూర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 13: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండాజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమరయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, ఆశా కార్యకర్త పొట్ల సంధ్య సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పేగు పురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు...