హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హుజురాబాద్ టౌన్, జూలై 13,అర్జున్ సమాచారం: హుజూరాబాద్ లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హుజూరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి సోమవారం తెలిపారు. హత్య జరిగిన కేవలం 36 గంటల్లోనే ఈ కేసును చేయించినట్లు వివరించారు. సోమవారం హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత (35) గత కొంతకాలంగా హుజూరాబాద్ మామిండ్లవాడలో నివాసం ఉంటుంది. ఆమె భర్త కుమార్ మృతి చెందగా,...