క్యూ లైన్ల ఆకస్మిక తనిఖీ శ్రీశైలం
శ్రీశైలం,అర్జున్ సమాచారం: శ్రీశైల ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మంగళవారం క్యూలైన్లు, విరాళాల కేంద్రాన్ని ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఆయా దర్శనo టికెట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవoతమైన దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ దర్శనం క్యూలైన్లను నిర్వహిస్తుండాలన్నారు. అధికారులు పరస్పర సమన్వయముతో విధులు నిర్వర్తించాలన్నారు. భక్తుల రద్దీ సమయంలో ముఖ్యంగా...