ముంబయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్ష శస్త్ర చికిత్స జరిగిన ఈ పరిస్థితుల్లోనూ ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్
అమరావతి,అర్జున్ సమాచారం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ముంబయిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కోలుకుంటున్న డిప్యూటీ సీఎంను మంత్రి దుర్గేష్ స్వయంగా కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి...