రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’ మూవీ టీజర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించగా, ఫస్ట్ సింగిల్ 'కంసంనిద' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ప్రారంభంలో కనకరాజు వాయిస్ ఓవర్‌తో తన...