గుండె జబ్బులు ఉన్నవాళ్లు “అమెన్” సినిమాకు రావద్దు – ఎస్కే బషీద్
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి మరో విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అమెన్’ (AMEN) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిరుచిగల దర్శకుడు, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎస్కే బషీద్ పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు....