ములుగు,అర్జున్ సమాచారం:
గురువారం నాడు మేడారం హరిత హోటల్లో మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తదితరులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి, పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో మంత్రి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా అధికారులు, స్థానిక సర్పంచ్, పూజారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.