అభివ్రుద్ధి కోసం నిధులిస్తే జీతాలకు, కరెంట్ బిల్లులకు మళ్లిస్తారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
రాజన్న సిరిసిల్ల,అర్జున్ సమాచారం: సిరిసిల్లలో రూ.105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన జిల్లా కలెక్టర్, ఎస్పీసహా ఉన్నతాధికారుల హాజరు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివ్రుద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్ధిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచులను బెదిరించి, ఒత్తిడి తెస్తోందన్నారు. అభివ్రుద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు...