వేగవంతంగా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,అర్జున్ సమాచారం: జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్‌లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, చిగురుమామిడి మండల కేంద్రం, ముల్కనూరు గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఫోర్‌లైన్ రహదారికి సంబంధించిన భూసర్వే, అలైన్‌మెంట్ పనులను పరిశీలించారు. ఫేజ్-1 కింద కొత్తపల్లి నుంచి సుందరగిరి వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు...