సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు • 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం • కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం • క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం • ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం • సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి • జిల్లా, పార్లమెంట్ పరిధిలో సమన్వయ కమిటీలు • తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అర్జున్ సమాచారం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని,...