ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్, జూలై 18,అర్జున్ సమాచారం: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS, మిషన్ భగీరథ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలోనూ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే, మిషన్ భగీరథ పైప్‌లైన్‌లలో లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యలు ఎక్కడా లేకుండా నిరంతర...