ఎమ్మెల్యే మీడియాపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి! జన్నారం బిఆర్ఎస్ నేతల డిమాండ్!!

ఖానాపూర్ ప్రతినిధి, అర్జున్ సమాచారం, జూలై 19: జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌పై బిఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జన్నారం మండల మాజీ అధ్యక్షులు గుర్రం రాజారాం రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన మీడియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే...