తెలంగాణ లో వైద్యం, ఆరోగ్యం పడకేసాయి మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించాను. బాలింతల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసకున్నారు. అలాగే, ఖమ్మంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లోనే చికిత్స పొందుతున్న మైనర్ బాలికను కూడా పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరీష్...