కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు సన్మానం జమ్మికుంట
జమ్మికుంట,అర్జున్ సమాచారం: మంగళవారం ఇల్లందకుంట మండల కేంద్రానికి వన మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి పూల బుకే అందించడం జరిగింది. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గొడిశాల పరమేష్, ఎడ్ల కిషన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి,గుండారపు సాయి, తదితరులు పాల్గొన్నారు..