మంచిర్యాల,అర్జున్ సమాచారం:
ఒక్క రైతులకే కాకుండా అన్ని వర్గాలకి హామీలిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. యువతకు యువత డిక్లరేషన్ పేరిట చేసిన మోసం పైన యువసంగ్రామ సదస్సు తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాం. అక్కడ వచ్చిన యువత కాంగ్రెస్ ప్రభుత్వంని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎండగట్టారు. యువత చేతికి రేవంత్ రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారు. తెలంగాణలో మళ్లీ రైతు ప్రభుత్వం రావాలి అంటే కాంగ్రెస్ నాయకులను ఉరికించి తరమాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మంగళవారం నాడె లక్సెట్టిపేట లోని శ్రీ వాసవి గార్డెన్స్ లో జరిగిన రైతు సదస్సులో అయన పాల్గోన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ అప్పుడే తెలంగాణలో కేసీఆర్ రి ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. తెలంగాణ యువత, రైతన్నలు కలిసి కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నాయకులు బయటికి కూడా రాలేరు. ఇప్పటికే 31 నెలలు అన్ని వర్గాలను మోసపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మిగిలింది 29 నెలలు మాత్రమే. ఇప్పటికే కాంగ్రెస్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మంచిర్యాల ఎమ్మెల్యే మంచి పనులు చేయాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.
కానీ మా పార్టీ నేతలను ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదు. మంచిర్యాలలో పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను, అధికారులను వేధించిన వారిని వదిలిపెట్టేదే లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు ప్రజల కోసం పని చేయాలి కాంగ్రెస్ కోసం కాదు. ఈ దుర్మార్గపు రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడకండి లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయి. యువత ఏ విధంగా తిరగబడిందో దేశ రాజధానిలో చూస్తున్నాము. ఢిల్లీలో వేల మంది పిల్లలు పార్లమెంట్ దగ్గర నిలబడి కేంద్రాన్ని గడగడలాడించిరో చూస్తూ ఉన్న చూసాము. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. యువత ఆకాంక్షలను పట్టించుకోకుంటే తెలంగాణ ఉద్యమ కాలంలో మాదిరి ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. కాంగ్రెస్, బీజేపీలను తన్ని తరిముతుందని అన్నారు.
ఉడుకు నెత్తురుతో యువత కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి తిరగబడే రోజు దగ్గరలో ఉన్నది. యువత, రైతన్నలు తిరగబడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బయటికి తిరగలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారు ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయక నిర్లక్ష్యం చేయడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని బి.ఆర్.ఎస్ 8 గంటలు ధర్నా చేసినా ప్రభుత్వం మనసు కరగలేదు. రెండున్నర నెలలు గడిచిన రైతు కుటుంబాలను ఆదుకునే సోయి ప్రభుత్వానికి లేదు. కిరాతకమైన ప్రభుత్వం రాష్ట్రంలో పాలిస్తుంది. షాపులో దొరికే యూరియాను యాప్ ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఓటేసిన పాపనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాటేస్తుంది. కరువుకి పరిష్కారమైన కాళేశ్వరంపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాళేశ్వరంలో పంపులు ఆన్ చేస్తే ఎల్లంపల్లికి నీళ్లొచ్చే అవకాశం ఉంది. కన్నెపల్లి వద్ద 94m ఎత్తులో నీరు పారుతున్నాయి… అన్నారం సిందిళ్ళ మెడిగడ్డ బ్యారేజీలు సమన్వయంతో నడిపిస్తే రోజుకు 3టీఎంసీల ఎత్తిపోయవచ్చు. రెండు పిల్లర్లు కుంగితే.. 36 నెలల్లో ఎందుకు రిపైర్ చేయడం లేదని రైతులు నిలదీస్తున్నారని మండిపడ్డారు.
==============================