నీటి సంరక్షణ పనులు ముమ్మరంగా చేయాలి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలి ఇందిరమ్మ ఇండ్లలో స్థాయిల వారీగా పురోగతి ఉండాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఏఈలు, ఎంపీడీఓలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష

రాజన్న సిరిసిల్ల,అర్జున్ సమాచారం: జిల్లావ్యాప్తంగా నీటి సంరక్షణ పనులు ముమ్మరంగా చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తెలంగాణ జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ ఏఈలు, ఎంపీడీఓలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు  తగ్గుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలు, పంటల సాగు, తాగునీరు, భూగర్భ జలాల వృద్ధి కోసం వర్షం నీటిని ఒడిసి పట్టాలని పిలుపు...