మహబూబాబాద్,అర్జున్ సమాచారం:
టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్సైలు అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లలో బృందాలుగా తనిఖీలు చేశారు. కొనుగోలు, రవాణా పత్రాలు, బిల్లులు, అనుమతులు పరిశీలించారు. ఈ డ్రైవ్లో మొత్తం 90 ప్రాంతాల్లో సోదాలు చేసి 10 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.59 కోట్ల విలువైన 266 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తిరుపతి రావు తెలిపారు.