ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:48 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కొత్త పేర్లతో దేశ వ్యతిరేక వేదికలను ఏర్పాటు యూపీఏ హయాంలోనే అత్యధిక జాతీయ పరీక్షల పేపర్లు లీక్ బీజేపీ రామచంద్రరావు

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
దేశంలో అలజడులు సృష్టించి మోదీ ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు కుట్ర చేస్తున్నాయి. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు భారత్లో సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు.
గురువారం అయన మీడియాతో మాట్లాడారు.
రామచంద్రరావు మాట్లాడుతూ ఎస్ఎఫ్ ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఏ  నేతలు కొత్త పేర్లతో దేశ వ్యతిరేక వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉంది. ఖలిస్తానీ, కతార్, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఈ ఉద్యమాలకు మద్దతు అందుతున్నట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇందిరా గాంధీ హత్యకు కారణమైన ఖలిస్తానీ శక్తులతో రాహుల్ గాంధీ జతకట్టడం సిగ్గుచేటని అన్నారు.
నీట్  లీక్ వెలుగులోకి రాగానే మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంది.  లీక్ కేసులో 31 మందిని అరెస్ట్ చేసి నిందితులపై చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అన్యాయం జరగకుండా అవసరమైన చోట రీ-ఎగ్జామ్స్ నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం 2024లో కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది.ఎన్ టీ యే లో సంస్కరణల ద్వారా పరీక్షల వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.2014కు ముందు యూపీఏ హయాంలోనే అత్యధిక జాతీయ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. అప్పట్లో ఒక్క విద్యాశాఖ మంత్రి కూడా నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ ఇప్పుడు రాజీనామాలు డిమాండ్ చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరి. యూపీఏ పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే వస్తే, మోదీ ప్రభుత్వం పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు 12 లక్షలకు పైగా నియామక పత్రాలు అందించింది. రోజ్గార్ మేళాల ద్వారా నిరంతరం ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. దేశంలో నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గింది. ఐఐటీలు, ఐఐఎంలు, ఏయిమ్స్ లు, నిట్ లు, మెడికల్ కళాశాలల సంఖ్యను మోదీ ప్రభుత్వం భారీగా పెంచింది.
ముద్రా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలతో కోట్లాది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభించాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలి. భారత్ను అస్థిరపరిచే కుట్రలను దేశభక్తి గల యువత ఎప్పటికీ విజయవంతం కానివ్వదు. ప్రధాని మోదీ నాయకత్వంలో నవభారత నిర్మాణంలో యువత భాగస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు.
========================