కొత్త పేర్లతో దేశ వ్యతిరేక వేదికలను ఏర్పాటు యూపీఏ హయాంలోనే అత్యధిక జాతీయ పరీక్షల పేపర్లు లీక్ బీజేపీ రామచంద్రరావు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: దేశంలో అలజడులు సృష్టించి మోదీ ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, విదేశీ విచ్ఛిన్నకర శక్తులు కుట్ర చేస్తున్నాయి. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు భారత్లో సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. రామచంద్రరావు మాట్లాడుతూ ఎస్ఎఫ్ ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఏ నేతలు కొత్త పేర్లతో దేశ వ్యతిరేక వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉంది....