మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థ ద్వారా భూములకు శాశ్వత భద్రత సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి,అర్జున్ సమాచారం: మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్చెయిన్ విధానాన్ని  రెవెన్యూ శాఖ రూపొందించింది. ప్రతి ల్యాండ్ పార్సెల్కు ప్రత్యేక డిజిటల్ ఐడీ ఇచ్చి టాంపర్-ప్రూఫ్, సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చెయిన్ వ్యవస్థ రూపకల్పన చేసారు. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చెయిన్ విధానం వుంటుంది. భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ గా ఉండేలా మీ భూమి-బ్లాక్ చెయిన్...