శ్రావణమాస ఏర్పాట్లపై ప్రాథమిక సమావేశం ఆగస్టు 13న శ్రావణమాసోత్సవాలు ప్రారంభం సెప్టెంబరు 12వ తేదీన ముగియనున్న శ్రావణమాసోత్సవాలు శ్రావణమాసోత్సవాలపై ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించిన కార్యనిర్వహణాధికారి
శ్రీశైలం,అర్జున్ సమాచారం: రాబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో ఉత్సవ నిర్వహణకు సంబంధించి కూలంకష చర్చ శ్రావణశుద్ధ పాడ్యమి, ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసోత్సవాలు నిర్వహింపబడనున్నాయి. భాద్రశుద్ధ పాడ్యమి సెప్టెంబరు 12 ఉదయాన ఈ మాసోత్సవాలు ముగుస్తాయి. ఈ మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు ( 23.07.2026) కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. పరిపాలనా కార్యాలయములోని సమావేశమందిరములో నిర్వహించబడిన ఈ సమావేశంలో అర్చకస్వాములు, వేదపండితులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు,...