ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 8:40 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఫైనల్ ట్రైలర్ విడుదల – ఆకట్టుకున్న టామ్ హాలండ్

మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ట్రైలర్‌లో ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజే (జెండయా)తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్‌గా ఉండబోతుందనే విషయం మరోసారి స్పష్టమైంది.
అలాగే ఈ ట్రైలర్‌లో మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు కూడా అధికారికంగా చూపించారు. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో ఆసక్తికరమైన అధ్యాయానికి ఈ సినిమా నాంది పలకనుంది. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిన్ కురిట్జ్‌కెస్ కథను అందించగా కెవిన్ ఫైగీ, ఏమీ పాస్కల్, అవి ఆరాడ్, రాచెల్ ఓ’కానర్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మన్, మైకేల్ మాండో, మార్క్ రఫాలో కీలక పాత్రల్లో నటించారు. ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అలాగే 2D, 3D, 4DX 3D, ScreenX, Dolby Cinema, ICE 3D, MX4D, P[XL], BIGPIX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
==============================