స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఫైనల్ ట్రైలర్ విడుదల – ఆకట్టుకున్న టామ్ హాలండ్

మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్‌లో 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజే (జెండయా)తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ...