తెలంగాణలో ట్రాఫిక్..రోడ్డు భద్రత బ్యూరో ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రవాణా వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే బ్యూరోకు సంస్థాగత నిర్మాణం ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి తెలంగాణ ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియాన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతీ 2 లేదా 3 నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని ఈ...