తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నారా రోహిత్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు – 329 యూనిట్ల రక్త సేకరణ

హైదరాబాద్, జూలై 25,అర్జున్ సమాచారం: విలక్షణ నటుడు నారా రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ వంటి సంప్రదాయ వేడుకలతో పాటు సమాజానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాల్లో అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మూడు కేంద్రాల్లో కలిపి 329 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేందుకు బ్లడ్ బ్యాంకులకు అందజేశారు. అదే విధంగా...