సింగరేణి సహకారంతో నాలుగు కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు
సింగరేణి సహకారంతో నాలుగు కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 25: రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సెంటినరీ కాలనీ సి-2 క్వార్టర్లలో నాలుగు ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ-పి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. సి-2 క్వార్టర్లలోని పాత ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, నర్సరీ చౌరస్తా, సి-2 చివరి క్వార్టర్లలోని రెండు చౌరస్తాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని గతంలో సర్పంచ్ పల్లె ప్రతిమ-పి...