“ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి” వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ యశోదా దవాఖానకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. దాదాపు అరగంట సేపు అక్కడే నిలుచుని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి క్షుణ్ణంగా...