ఏసీబీ హంట్… భయపడుతున్న అవినీతి అధికారులు
హైదరాబాద్,,అర్జున్ సమాచారం:: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి అనే విధంగా తెలంగాణలో అవినీతి అధికారుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏసీబీ దాడులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఇన్నాళ్లుగా చిన్న స్థాయి అధికారుల మీద పడ్డ శాఖ ఇప్పుడు పెద్ద తలకాయల మీద దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడంతో అధికారులు ఎవరిని వదిలిపెట్టకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కేవలం సాధారణ తనిఖీలు కాకుండా పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా...