ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 4:51 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా జననీరాజనం

పెనమలూరు,అర్జున్ సమాచారం:
కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా జననీరాజనం లభించింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ కు  పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద మంత్రి లోకేష్ కు  టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము తదితరులు స్వాగతం పలికారు. ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు నుంచి పునాదిపాడుకు మంత్రి లోకేష్  భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్, కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.