నగరపాలక సంస్థకు 36 వినతులు. కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి .

తిరుపతి,అర్జున్ సమాచారం: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36వినతులు వచ్చాయని కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 16 మంది, కార్యాలయంకు నేరుగా వచ్చి 20 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా సంజీవయ్య కాలనీలో ఇంటి ముందు ప్రమాధకరంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని, పట్నూల్ వీధిలో...