కుప్పం,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం నాడు కుప్పంలో పర్యటించారు. పర్యటన లో భాగంగా రామకుప్పం మండలం, పీఎంకే తాండ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు.
ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ • 2024 ఎన్నికల్లో రామకుప్పం మండలంలోని తాండాల్లో తెలుగుదేశం జెండా ఎగిరింది. చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కుప్పం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. నియెజకవర్గానికి ఒకేసారి 30 పరిశ్రమలు తెచ్చారు. ఈ పరిశ్రమల ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని అన్నారు.
మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు. ఏదైనా సాధించగల శక్తి మహిళలకు ఉంది. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు శిక్షణ తీసుకుని ఉపాధి అవకాశాలు పొందాలి. ఒకప్పుడు బిజినెస్ అంటే నాకూ తెలీదు. ధైర్యంగా ముందుడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం. గతంలో మన కుప్పానికి నీటి ఎద్దడి ఉండేది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణాజలాలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల దశాబ్ధాల కల నెరవేర్చారు. నదుల అనుసంధానంతో సాగు, తాగు నీరు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో మీరంతా చూశారు. కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు. చంద్రబాబు సుపరిపాలన అందిస్తారనే నమ్మకంతో కూటమిని ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, స్త్రీ శక్తి , అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. పీఎంకే తాండాలో అర్హులందరికీ సంక్షేమం అందుతోంది. పంచాయతీ పరిధిలో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో రహదారుల నిర్మాణం చేపట్టారు. కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించారని అన్నారు.
ఈ తాండాలో గోకులం షెడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. రూ.25 లక్షలతో ఓం శక్తి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని అన్నారు.
కావలి మడుగు గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అనంతరం పీ4 కింద పలువురు విద్యార్థులకు సైకిళ్లు , క్రీడా పరికరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పీ4 కింద అందిన రూ.75 వేల సాయంతో ఓ మహిళ ఏర్పాటు చేసిన కిరాణా షాపును భువనేశ్వరి ప్రారంభించారు.
==========================