అవయవాలు దెబ్బతిన్న రోగులకు అపరసంజీవని సీఆర్ఆర్టీ మెడికవర్ వైద్యుల వెల్లడి

కరీంనగర్,అర్జున్ సమాచారం: అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ (సీఆర్ఆర్టీ) అపర సంజీవనిలా పనిచేస్తోందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో సీఆర్ఆర్టీ యంత్రం పనితీరు, దాని ప్రయోజనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు సీఆర్ఆర్టీ ఎంతో కీలకంగా ఉలపయోగపడుతుందని వివరించారు. బీపీని మెయింటెన్ చేసే మందులతో 24 గంటలు డయాలసిస్ చేస్తూ ప్రాణాపాయం నుంచి కాపాడే మిషనే సీఆర్ఆర్టీ...