ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసులు ఏపీ -తెలంగాణ సీఎంలది ప్రత్యేక స్థానం! దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రులుగా దక్షిణాది నేతలు ఆస్తుల్లో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మొదటి స్థానం ఏపీ సీఎం చంద్రబాబుకు రెండో స్థానం. క్రిమినల్ కేసుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అగ్రస్థానం. రేవంత్ రెడ్డిపై దేశంలోనే అత్యధికంగా 80 కేసులు నమోదు.

హైదరాబాద్,అర్జున్ సమాచారం: దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు,3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 మంది సీఎంల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రులుగా దక్షిణాది నేతలే తొలి మూడు స్థానాల్లో నిలిచారు. రూ.1413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉండగా, రూ.931 కోట్ల ఆస్తులతో...