మంచిర్యాల హెడ్ పోస్టాఫీసుపై అధికారుల నిర్లక్ష్యం – కనీస సౌకర్యాలు లేక కస్టమర్ల తీవ్ర అవస్థలు
మంచిర్యాల, అర్జున్ సమాచార ప్రతి నిధి, జూలై 28 మంచిర్యాల జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం (హెడ్ పోస్టు ఆఫీసు) నిర్వహణలో తపాలా శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రజలకు తీవ్ర శాపంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా, నిబంధనలకు అనుగుణంగా హెడ్ పోస్టాఫీసును నిర్వహించాల్సి ఉండగా, అధికారుల తీరు ఎవరికో ప్రయోజనం చేకూర్చేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం హెడ్ పోస్టాఫీసు నిర్వహణకు 7,000 నుండి 8,000 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. కానీ, అధికారులు మాత్రం కేవలం 2,100 చదరపు అడుగుల...