అరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం “క్రోటన్ ఉబ్బలమడు గెన్సిస్” అని పేరు పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త వృక్ష జాతి

విజయవాడ,అర్జున్ సమాచారం: తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,   అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్  నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు....