భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ నితికా పం వరద ఉధృతి సమయంలో వాగులు, వంతెనలు దాటొద్దు – తుంపెల్లి, గుండి వాగుల వద్ద ఎస్పీ అప్రమత్తత సూచనలు వరద ముంపు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం.. ప్రజలు సహకరించాలి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలకు పోలీసు శాఖ కీలక సూచనలు

కుమురం భీమ్ ఆసిఫాబాద్,అర్జున్ సమాచారం: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా  జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ  నితికా పంత్,  సూచించారు. ఆసిఫాబాద్ లోని తుంపెల్లి వాగు, గుండి వాగు లను పరిశీలించి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వరద తగ్గిన తర్వాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రత చర్యలకు సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రానున్న నాలుగు రోజుల...