38 కేసుల్లో లభించిన 63.621 కిలోల గంజాయి,1 గంజాయి మొక్క దగ్ధం: కరీంనగర్ సిపి గౌస్ ఆలం.
కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి మరియు 1 గంజాయి మొక్కను ధ్వంసం చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి.వెంకటస్వామి...