సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర ఆదేశాలు 15 రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించిన జాతీయ ఎస్సీ కమిషన్ రైతుల తరఫున ఢిల్లీ వరకు పోరాటం చేసిన షాద్ నగర్ బీజేపీ నేతల చొరవ ఫలితం

రంగారెడ్డి,అర్జున్ సమాచారం: కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) కేంద్రం ఏర్పాటుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) స్పందించింది. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన పట్నం సురేష్ సమర్పించిన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూకు అధికారిక లేఖ పంపింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం, ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ వల్ల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు, చిన్న రైతుల భూములు, జీవనోపాధి, ఆరోగ్యం, రాజ్యాంగ...