సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులు వివరించండి సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ ఏలేరు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు సూపర్ ఎల్ నినో పరిస్థితులపై చర్చ

అర్జున్ సమాచారం: సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్  రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు  నిమ్మల రామానాయుడు కి సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. సూపర్ ఎల్ నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో...