గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తం లోతట్టు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం: భద్రాచలం వద్ద గోదావరి నదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్, గోదావరి కరకట్ట, స్నాన ఘాట్లు, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు...