మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి నాణ్యమైన చేపల ఆహారాన్ని ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను పరిశీలించి నిర్వహణ, పరిశుభ్రతపై అధికారులతో సమీక్ష
హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గారికి మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, అదనపు డైరెక్టర్ మురళీకృష్ణతో పాటు శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వినియోగదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్న...